వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా 

వైసీపీకి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు. 

తనపై ఎంపీగా అనర్హత వేటు వేయించేందుకు మొహమ్మద్ గజినీ మాదిరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారని... మీరు కోరుకున్న ఫలితం ఈరోజు వచ్చిందని రాజీనామా లేఖలో రఘురాజు పేర్కొన్నారు. తనపై మీరు దాడి చేసిన ప్రతిసారి, తనను భౌతికంగా నిర్మూలించాలని మీరు ప్రయత్నించినప్పటికీ... తాను కూడా అంతే స్థాయిలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానని చెప్పారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. 

ఈరోజు టీడీపీ - జనసేనలు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నాయి. టీడీపీ తరపున పోటీ చేయాలని రఘురాజు భావిస్తున్నారు. అయితే, పొత్తులో భాగంగా నర్సాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu