రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. జీజీహెచ్ వైద్యులను విచారించిన పోలీసులు

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.  రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఏ5గా ఉన్న సంగతి తెలిసిందే.

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కు గురి కాలేందంటూ ఆమె వైద్యులపై ఒత్తిడి తెచ్చి మరీ నివేదిక ఇచ్చారంటూ ఆమెపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆమెను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను విచారించడం కంటే ముందుగా నాడు రఘురామకృష్ణం రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ అధికారి డాక్టర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్, ఈసీజీ టెక్నీషియన్ లను విచారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.