మోడీ సర్కార్ ను ఏమనొద్దు..
posted on Sep 6, 2016 10:25AM

రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా రఘురామ్ రాజన్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. రఘురామ్ రాజన్ స్థానంలో నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఉన్న ఉర్జిత్ పటేల్‌ను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి పదవి ఇవ్వలేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును నిదించడం భావ్యం కాదని.. రఘురాం రాజన్ వ్యాక్యానించారు. సంస్కరణల అమలు వేగవంతం చేసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం ఒక్కటే మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో బ్యాంకులను సరిదిద్దే పని కొనసాగుతోందని, తదుపరి గవర్నర్ ఆ బాధ్యతను పూర్తి చేస్తారని అన్నారు. గతంలో బ్యాంకులు ముందూ వెనుకా చూసుకోకుండా రుణాలిచ్చేసి, వాటిని తిరిగి వసూలు చేయడంలో విఫలం అవుతూ రిస్క్ లో పడ్డాయని రాజన్ వ్యాఖ్యానించారు.