మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి మృతి

 

ప్రముఖ మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గురువారం నాడు విశాఖలో కన్నుమూశారు. ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి రాణించారు. రాగతి పండరి అవివాహిత. బాల్యంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డారు. అయినప్పటికీ కార్టూనిస్టుగా రాణించారు. చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆమె కార్టూన్లు గీసేవారు. ఆమె గీత తెలుగు పాఠకులకు సుపరిచితం. రాగతి పండరికి శ్రద్ధాంజలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu