ఖతార్‌కు నాలుగు ముస్లిందేశాల తలాక్

ఖతార్‌కు నాలుగు అరబ్ దేశాలు తలాక్ చెప్పాయి. సమీప దేశాలను అస్థిరపరుస్తున్న కారణంగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముస్లిం బ్రదర్‌హుడ్ సహా పలు ఉగ్రసంస్థలకు ఖతార్ మద్దతు ఇస్తోందని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఖతార్ పౌరులు ఈ తమ దేశాలను విడిచి వెళ్లేందుకు 14 రోజుల గడువును ఇచ్చాయి. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది..ఇందుకు గాను వారికి 48 గంటల సమయం ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu