పెళ్లి చేసుకోమన్నందుకు గోదావరిలోకి తోశాడు
posted on Jun 5, 2017 11:05AM

పెళ్లిచేసుకోమన్న పాపానికి ప్రేయసిని గోదావరిలోకి తోసేశాడు ఒక ప్రేమికుడు. అసలు వివరాల్లోకి వెళితే రాజమండ్రికి చెందిన గండి అలివేణి స్థానిక గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎస్.యానంకు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు రాజమండ్రిలోని బట్టలషాపులో పనిచేసేవాడు. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు..ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుని ప్రేమకథకు శుభంకార్డు వేద్దామని అలివేణి శ్రీనివాస్‌ను కోరుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ నిన్న రాత్రి యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై గడిపారు. అయితే తెల్లవారుజామున పెళ్లి విషయంపై అలివేణి నిలదీయడంతో శ్రీనివాస్ ఆమెను తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసెశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్, హ్యాండ్‌బాగ్ తీసుకుని పరారయ్యాడు. అయితే నీటిలో కొట్టుకుపోతున్నఅలివేణిని మత్స్యకారులు రక్షించి యానాం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రియుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.