ప్రయాగ్ రాజ్ నో వెహికిల్ జోన్

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాటికి 45 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 12) మాఘపౌర్ణిమ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనలు ఉన్నాయి. గత మూడు రోజులుగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ అంచనాల మేరకు ప్రయాగ్ రాజ్ ను బుధవారం (ఫిబ్రవరి 12) నో వెహికిల్ జోన్ గా అధికారులు ప్రకటించారు. మంగళవారం (ఫిబ్రవరి11) సాయంత్రం నంచి బుధవారం రాత్రి 7.22 గంటల వరకూ మాఘపౌర్ణిమ ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు, అత్యవసర,  సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే ప్రయాగ్ రాజ్ లోకి అనుమతిస్తారు.