15 నుంచి రాంకీ ఎస్టేట్ క్రికెట్ మహోత్సవం రాంకీ ప్రీమియర్ లీగ్
posted on Feb 12, 2025 8:55AM
.webp)
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ రాంకీ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో రాంకీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఆర్పీఎల్ రెండో సీజన్‌కు సంబంధించి సన్నాహక కార్యక్రమం గచ్చిబౌలిలోని రాడిసన్ లో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్కే ప్రసాద్ తో పాటు రాంకీ గ్రూప్ సీఎఫ్‌వో ఎన్ఎస్ రావు, ప్రాంతీయ డైరెక్టర్ శరణ్ అల్ల జ్యోతిప్రజ్వలన చేశారు. ఆర్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా రాంకీ ఎస్టేట్స్ లోని కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందడి. కుటుంబాల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఎస్టేట్ లో జీవనం సాగించే కుటుంబాల మధ్య మరపురాని, మరువలేని జ్ఞాపకాలను నెలకొల్పేందుకు ఆర్పీఎల్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
గత ఏడాది జరిగిన టోర్నీకి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాంతో ఈ సారి ఆర్పీఎల్ ను మరింత విస్తరించామనీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడు టోర్నీలోని మ్యాచ్ లు రాత్రివేళల్లోనూ జరగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు ఎప్పటిలాగే కొనసాగనుండగా.. ఫైనల్స్ ప్లడ్‌లైట్స్ కింద జరగనుంది. రామ్‌కీ ఎస్టేట్స్ లో పదివేలకుపైగా కుటుంబాలు టోర్నీలో చురుగ్గా పాల్గోనున్నాయి. గత సంవత్సరం ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీలో పన్నెండు జట్లు ఆడగా.. ఈ సీజన్ లో 16 జట్లకు అవకాశం కల్పించారు. రాంకీ ఎస్టేట్స్ లోని పన్నెండు సముదాయాల నుంచి 16 జట్లు ఈ టోర్నీలో పాల్గోంటున్నాయి. 31 మ్యాచ్ లు జరుగుతాయి. రాంకీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శనివారం (ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లతో పాటు నాలుగు క్వార్టర్ ఫైనల్స్, రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది.
రాంకీ ఎస్టేట్స్‌లో నివాసదారుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించడంలో మేము మా పాత్రను పోషిస్తున్నామని రాంకీ ఎస్టేట్స్ గ్రూప్ సీఎఫ్ఓ ఎన్.ఎస్. రావు అన్నారు. రాంకీ ఎస్టేట్స్ ప్రాంతీయ డైరెక్టర్ శరణ్ అల్లా రామ్‌కీ ఎస్టేట్స్ లోని నివాసదారులు అత్యుత్తమ జీవనశైలిని అనుభవిస్తూనే వారి మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆర్పీఎల్ దోహదపడుతుందన్నారు.