మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఆయన చాలారోజుల పాటు కోమాలో ఉండి, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిశారు.

 

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని, కొద్దిసేపటి క్రితమే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు అభిజిత్ వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu