కేజ్రీవాల్ స్లైడ్ షో.... కుప్పకూలిపోయిన కపిల్ మిశ్రా


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గత నాలుగు రోజుల నుండి నిరాహార దీక్షలో ఉన్నారు. అంతేకాదు ఈరోజు తాను కొన్ని విషయాలు బయటపెడతానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే మీడియాను పిలిచిన ఆయన కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలతో కూడిన స్లైడ్ షోను ప్రదర్శిస్తూ అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న ఆయన అనుచరులు, పోలీసులు మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కపిల్ మిశ్రాకు నిపుణులైన డాక్టర్ల నేతృత్వంలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu