స్వామి ప్రబోధానంద కన్నుమూత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ప్రబోధానంద జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు తాడిపత్రిలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతూ ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథాలు రచించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువుగా మారిపోయారు.

తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని.. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని చెప్పేవారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu