పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.  పోప్ ఫ్రాన్సిస్ వయస్సు 88 ఏళ్లు.   1936 డిసెంబర్ 17న  జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.

 పోప్​ తన జీవితమంతా చర్చి సేవకే అంకితమయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ రోజున సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన  ఆరోగ్యం క్షీణించి మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల  ప్రపంచ వ్యాప్తంగా నాయకులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.