నాగ చైతన్య తో మిస్ ఇండియా

 

నాగచైతన్య హీరోగా త్వరలోనే మరో చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని తెలిసింది. ఈ చిత్రంలో మిస్ ఇండియా యూనివర్స్ పూజా హెగ్డే నాగచైతన్యతో కలిసి రొమాన్స్ చేయబోతుంది. రొమాంటిక్, కామెడి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం నాగచైతన్య "మనం" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu