దానిమ్మ జ్యూస్ తీసుకుంటే నిజంగానే బరువు తగ్గుతారా?

పండ్ల-కూరగాయల జ్యుస్ లు  మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా, శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అందుతాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.  పండ్లలోకి దానిమ్మ పండు చాలా శక్తివంతమైనది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం దానిమ్మ పండు తీసుకోవడం జరుగుతుంది. దానిమ్మ గింజలను నేరుగా తినకుండా చాలా మంది జ్యుస్ తయారుచేసుకుని తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు.  దానిమ్మ రసం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను సరిదిద్దడంలో, రక్తహీనతకు చికిత్స చేయడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో.. ఇలా బోలెడు రకాలుగా సహాయపడుతుంది.

అయితే దానిమ్మరసం కేవలం పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా  బరువు తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందా?

 చాలామంది తమ  డైట్ ప్లాన్‌లలో బరువు తగ్గడానికి దానిమ్మ రసాన్ని చేర్చుకోవాలని నిపుణులే సలహా ఇస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి దానిమ్మ ఎంతవరకు బెస్ట్ ఆప్షన్?? అసలు దానిమ్మ వల్ల ప్రయోజనాలు ఏంటి?? 

బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దానిమ్మ జ్యుస్ లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ సమర్థవంతమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు కాబట్టి, దీని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా బరువు పెరిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జజీవక్రియ కోసం..

దానిమ్మ జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది, ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ కార్సినోజెనిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని  జంతు అధ్యయనాలలో నిరూపితమైంది. ప్రేగుల ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు దానిమ్మ ది బెస్ట్.. జీవక్రియను సరిగ్గా ఉంటే.. తిన్న ఆహారం జీర్ణమై బరువు పెరగకుండా చేస్తుంది.  

యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా..

పాలీఫెనాల్స్ అని పిలువబడే ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను దానిమ్మ కలిగి ఉంటుంది. శరీరంలోని వివిధ రకాల తాపజనక పరిస్థితులకు చికిత్స చేయడానికి పాలీఫెనాల్స్ ప్రభావవంతంగా ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD), రుమటాయిడ్ ఆర్థరైటిస్, జీవక్రియ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి తాపజనక సమస్యల చికిత్సలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..

దానిమ్మ అనేక ప్రభావవంతమైన పోషకాల నిధి, దీని వినియోగం శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. 

దానిమ్మలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇది క్యాన్సర్ నివారణలో ప్రయోజనాలను కలిగి ఉంది.

అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఇది ఆర్థరైటిస్‌లో మేలు చేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.

                                               ◆నిశ్శబ్ద.