పెద్ద ఎత్తున పోలీసుల బదలీలకు రంగం సిద్ధం!?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి  అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదలీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు డీఎస్పీలు, సీఐల బదలీలపై దృష్టి పెట్టింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు శాఖ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది, దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో తప్పిదాలకు, అక్రమ కేసుల బనాయింపునకు పాల్పడిన వారిని బదిలీ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బదలీల్లో సమర్థతకు పెద్ద పీట వేస్తే పోలీసు శాఖ స్వతంత్రంగా సమర్థంగా పని చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారుల భావిస్తున్నారు. అలా కాకుండా సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తే పరిస్థితిలో మార్పు ఉండేందుకు ఆస్కారం ఉండదన్న అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారులతో వ్యక్తం అవుతోంది.

విధి నిర్వహణలో చట్ట బద్ధంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకున్న అధికా రులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో పైరవీలు, సిఫారసులకు అవకాశం లేకుండా చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu