జగన్ కు తెలివి లేదు.. చాతకాదు.. మనసులో మాట బయటపెట్టిన మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ ను తన ఐదేళ్ల అధ్వాన పాలనతో అస్తవ్యస్థంగా మార్చేసిన జగన్ ఓటమి తరువాత కూడా తన తీరు మార్చుకోలేదు. జనం తిరస్కరించారన్న సోయ కూడా లేకుండా.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి విస్మరించి.. వ్యక్తిగత ఘర్షణలకు సైతం పొలిటికల్ కలర్ ఇస్తూ హస్తినలో ధర్నా అంటూ హడావుడి చేస్తున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ను లైట్ తీసుకోవాలంటూ  ఆయన పార్టీకే చెందిన మాజీ ఎంపి మార్గాని భరత్  తెలియకుండానే చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన ఓటమికి కారణాలు వివరిస్తూ జగన్ చాతకాని తనాన్ని బయట పెట్టేశారు.  జగన్ మద్యం విధానం పార్టీని దారుణంగా దెబ్బతీసిందని అంగీకరించేశారు.  ఈ విషయంలో జగన్ తెలివితక్కువగా వ్యవహరించారని మార్గాని భరత్ తన మనసులో మాట చటుక్కున బయటకు చెప్పేశారు.

ఒక టూత్ పేస్ట్ కొనే విషయంలోనే మనకు ఏ బ్రాండ్ కావాలన్నది ఆచితూచి ఎంచుకుంటాం. అటువంటిది   మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కోవాలని అనుకోరా అని ప్రశ్నించారు. మేం అమ్మిందే తాగండి అంటే జనం వినరని కూడా భరత్ స్పష్టంగా చెప్పారు. తనకే అర్థమైన ఇంత చిన్న లాజిక్ తమ పార్టీ అధినేత జగన్ కు ఎందుకు అర్ధంకాలేదని పాపం భరత్ ఇప్పుడు బాధ పడుతున్నారు.  జగన్ కు మద్యం అలవాటు లేకపోవడం వల్ల ఈ విషయం ఆయనకు తెలియలేదని కవర్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మద్యం అలవాటు లేకపోతే మాత్రమేం.. రోజూ బ్రష్ చేసుకుంటారు కాదా? అంటూ నెటిజనులు మార్గాని భరత్ కు ఆయన లాజిక్ తోనే ఎదురు సెటైర్లు  వేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu