ఇంతకీ శాంతి భర్త ఎవరు?

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో ఒకదాని తరువాత ఒకటిగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాను ఎప్పుడో 2016లోనే తమ కులాచారం ప్రకారం మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చేశానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించిన శాంతి.. తాను లాయర్ సుభాష్ రెడ్డిని 2020లో వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే 2016లోనే విడాకులిచ్చిన మదన్ మోహన్ పేరునే 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో భర్తగా పేర్కొన్నారు. ఆమె సర్వీస్ రిజిస్టర్ లో కూడా అదే ఉంది.  అంతే కాదు.. గత ఏడాది జనవరిలో మెటర్నటీ లీవ్ కోసం చేసుకున్న దరఖాస్తులో కూడా శాంతి తన భర్త పేరు మదన్ మోహన్ అనే పేర్కొన్నారు. కానీ ఇటీవల అంటే జులై 17న.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మదన్ మోహన్ తన భార్య శాంతికి విజయసాయిరెడ్డితో సంబంధం ఉందనీ, ఆమెకు పుట్టిన మగబిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఫిర్యాదు చేసిన తరువాత.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మదన్ మోహన్ కు తాను ఎప్పుడో విడాకులు ఇచ్చేశాననీ,  పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. 

దీంతో విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న శాంతి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ  15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసు జారీ చేశారు.     అంతే కాకుండా  ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేశారు.  శాంతి ఇప్పటికే అవినీతి ఆరోపణలతో  సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్  ఉన్న శాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రస్తావించిన అంశాలతో పాటు, ఎటువంటి అనుమతీ లేకుండా మీడియాతో మాట్లడటం సహా  పలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆమెపై ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.   

తాజాగా వివరణ కోరుతూ జారీ చేసిన నోటీలులో   విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడం,  దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించడం,  కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లడటం అలాగే..  వైసీపీ ఎంపీను ప్రశంసిస్తూ ట్వీట్ చ చేయడం , అలాగే విశాఖలో  ఆమె నివాసం ఉన్న అపార్ట్ మెంట్ లోని వేరే ప్లాట్ వారితో గొడవపడి పోలీసు స్టేషన్ కు ఎక్కడం వంటి అంశాలపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసు చారీ చేశారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu