ఒక్క పక్క డీజీపీ సెమినార్... మరోపక్క ఫోన్లలో ఆటలు..
posted on Jun 29, 2017 12:58PM

స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ఎవరి ప్రపంచం వారిదైపోయింది. ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అని కూడా లేకుండా ఫోన్లలో నిమగ్నమైపోతున్నారు. సామాన్య ప్రజలే కాదు అధికారులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. అలా చేసే బుక్కయ్యారు కొంతమంది పోలీసు అధికారులు. వివరాల ప్రకారం.. బీహర్ లోని పాట్నాలో సీఎం నితీశ్ కుమార్, డీజీపీల సెమినార్ జరిగింది. అయితే ఈ సెమినార్ కార్యక్రమంలో పలువురు పోలీసులు కూడా హాజరయ్యారు. కానీ కార్యక్రమానికి హాజరైన పోలీసులు ఎంచక్కా వెనక కూర్చొని తాపీగా తమ సెల్ ఫోన్లలో ఆటలాడుకుంటూ కనిపించారు. వీడియోలు చూస్తూ.. మరి కొంతమంది క్యాండి క్రష్ గేమ్స్ ఆడుతూ కనిపించారు. ఇంకేముంది ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
