భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ జీతం ఎంతో తెలుసా?
posted on Jun 29, 2017 12:34PM
.jpg)
ముకేశ్ అంబానీ అన్నా, రిలయన్స్ కంపెనీ పేరు అన్నా తెలియని వాడు భారత దేశ నలుమూలలా ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కనీసం తమ సొంత నంబర్ ఏంటో తెలియదు కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరా జియో సిమ్ లు ఉన్నాయి. మన దేశంలో ఫ్రీ ఆఫర్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మార్కెట్ విశ్లేషణలు తెలుసు కాబట్టే ముకేశ్ అంబానీ ఫ్రీ ఆఫర్ పెట్టి అందరూ జియో సిమ్ లు కొనేలా చేసాడు. ఒకరకంగా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న అందరు ఆపరేటర్లకు జియో తో చుక్కలు చూపించాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా జియో ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినా, వాళ్ళ పప్పులు ఉడకనివ్వకుండా చేసాడు. ఒక రోజులో దాదాపు సమయం వ్యాపార వ్యవహారాల మీద ఖర్చు చేసే ముకేశ్ అంబానీ వార్షిక జీతం, మరియు వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? ఆయన వార్షిక జీతం 15 కోట్లు కాగా, వార్షిక ఆదాయం 24 కోట్లు. సంవత్సరానికి అతని మొత్తం ఆదాయం 39 కోట్ల వరకు ఉంది. అయితే ఇంతకు ముందు ముకేష్ అంబానీ వార్షిక ఆదాయం 44 కోట్లు ఉంటే దాని మీద అతను దాదాపు 5 కోట్లు తగ్గించుకున్నాడు. ఇది ఎందుకు చేసాడు అంటే తన కంపెనీ లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచడానికి. ఈ విషయంలో ముకేశ్ అంబానీ నిజంగా గొప్పవాడే. ఆ మాట కొస్తే ఉద్యోగుల బాగోగుల గురించి ఆలోచించే ప్రతి వ్యాపార వేత్త గొప్పవాడే.