సంకల్పం నుంచి సాకారం వైపు... హ్యూస్టన్ లో మోడీ పవర్ ఫుల్ స్పీచ్

 

హ్యూస్టన్ వేదికగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వేషభాషల గొప్పతనం గురించి ప్రపంచానికి చాటిచెప్పారు ప్రధాని మోడీ. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ జీవన సంస్కృతి అంటూ గొప్పగా చెప్పారు. భారత్ ఇప్పుడు... సంకల్పాన్ని దాటి.... సాకారం వైపు పయనిస్తోందన్నారు. హ్యూస్టన్ సభలో భారత్ ఎదుగుదల గురించి వివరించిన మోడీ.... నవీన భారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కొత్త కలల సాకారం దిశగా భారత్‌ ముందుకెళ్తోందని, జాతి మొత్తాన్ని శక్తివంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మోడీ అన్నారు.

గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను మోడీ ప్రస్తావించారు. మమ్మల్ని మేమే పోటీదారులుగా భావిస్తున్నామన్న మోడీ... మాలో నిరంతరం మార్పును అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో ఎవరూ ఊహించనంతగా భారత్ ను ముందుకు తీసుకెళ్లామన్న మోడీ... ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్యాస్ వినియోగం, గ్రామీణ పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం ఇలా అన్ని విభాగాల్లోనూ 95శాతానికి పైగా ప్రగతి సాధించామన్నారు. ఇక, గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేయడమే కాకుండా... 37కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు తెలిపారు.

ఇక, అమెరికా జనాభా కంటే రెట్టింపు ప్రజలు భారత ఎన్నికల్లో పాల్గొన్నారన్న మోడీ... 60ఏళ్ల తర్వాత అత్యంత బలమైన ప్రభుత్వం భారత్‌లో ఏర్పడిందని గుర్తుచేశారు. అంతేకాదు ఐదేళ్ల అధికారం తర్వాత మరింత శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదంతా కేవలం మోడీ వల్ల జరిగింది కాదని... భారతీయుల సంకల్పమని... ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు భారత ప్రగతికి నిదర్శనమని అన్నారు. 130కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా మోడీ శక్తిమంతుడంటూ వ్యాఖ్యానించిన నమో... ట్రంప్ ప్రశంసలు భారతీయులందరికీ చెందుతాయంటూ గొప్పుగా చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu