ట్రంప్‌కి స్టాండింగ్ ఒవేషన్... పాక్‌పై నిప్పులు చెరిగిన మోడీ

హ్యూస్టన్ సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ ఉక్కు సంకల్పానికి మద్దతుగా సభకు హాజరైనవారంతా ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. మోడీ పిలుపు మేరకు సభకు హాజరైన ప్రవాస భారతీయులంతా నిలబడి ట్రంప్‌కు మద్దతుగా చప్పట్లు కొట్టారు.

అమెరికా హ్యూస్టన్ వేదికగా భారత ప్రధాని నరేంద్రమోడీ.... పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సముఖం నుంచి... పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా... వాటి మూలాలు పాక్‌లోనే ఉంటాయన్న మోడీ... అమెరికాలో 9/11... భారత్ లో 26/11 దాడులకు కుట్ర జరిగింది పాకిస్తాన్ లోనే అన్నారు. ఉగ్రపోరులో అమెరికా, భారత్ కలిసి నడుస్తాయన్నారు. ఇక, కశ్మీర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మోడీ... 370 ఆర్టికల్‌ను రద్దుచేసి, 70ఏళ్లుగా నానుతోన్న సమస్యకు చిటికెలో పరిష్కారం చూపించామన్నారు.

ఇక, మోడీ, తన ప్రసంగం ముగిశాక, ట్రంప్‌ను వెంటబెట్టుకుని స్టేడియం అంతా కలియదిరిగారు. సభకు హాజరైన ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. దాంతో స్టేడియం మొత్తం... మోడీ-ట్రంప్ నినాదాలతో మార్మోగిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu