పాకిస్థాన్‌ని మోడీ కట్టడి చేయాలి.. అంతే.. రాహుల్
posted on Oct 9, 2014 9:13AM
.jpg)
జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పలు జరుపుతున్నారు. ఈ విషయంలో భారతీయులందరూ పాకిస్థాన్ వైఖరిని తప్పుపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని నరేంద్రమోడీని తప్పు పడుతున్నారు. నరేంద్రమోడీ పాకిస్థాన్‌ని కట్టడి చేయపోవడం వల్లే ఈ కాల్పులు జరుగుతున్నాయి. విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోడీ మీద విమర్శలు కురిపించారు. పాకిస్థాన్, చైనాల మీద దూకుడుగా వ్యవహరిస్తామని లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ చెప్పేవారని, పాక్ పలుసార్లు కవ్వింపు చర్యలకు దిగినా గత మూడు నెలలుగా ఆయున చేసిందేమీ లేదని రాహుల్ గాంధీ అన్నారు.