మతానికి, ఉగ్రవాదానికి లంకె వద్దు: మోడీ
posted on Nov 13, 2014 2:42PM

మతానికి, ఉగ్రవాదానికి ముడి పెట్టవద్దని, రెండిటి మధ్య వున్న సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. మయన్మార్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటు వాదం విపరీతంగా పెరిగిపోతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం వుందని మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన పలు చర్యలను మోడీ ఈ సదస్సులో వివరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయని, ఉగ్రవాదానికి తోడు మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ తయారయ్యాయని మోడీ అన్నారు. ఈ సమావేశంలో మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు లీకెకి యాంగ్‌తోపాటు పలు దేశాధినేతలు పాల్గొన్నారు.