మోడీని చంపడానికి పాక్ ప్లాన్... 50 కోట్లు ఇస్తాం..!


ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపడానికి ప్రయత్నాలు జరుగినట్టు గతంలో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీని చంపడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఉండే సోని అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోదీని చంపేందుకు తమతో చేయి కలపాలని..ఇప్పటికి ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశామని.. మూడో వ్యక్తి కోసం చూస్తున్నామని... దీనికోసం రూ. 50 కోట్లు ఇస్తామని.. అవసరమైతే ఇంకా డబ్బు ఇస్తామని చెప్పారట. అయితే ఈవిషయాన్ని సోనీ  పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తైతే అది నిజమైన కాలా? లేక ఫేక్ కాలా? అనే విషయం తెలుస్తుందని అన్నారు.