హత్యా రాజకీయాలతో నాకు సంబంధం లేదు...
posted on May 22, 2017 4:01PM

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కర్నూలు జిల్లా అంతా కలకలం రేగుతోంది. మరోపైపు తమ నేత హత్యకు టీడీపీయే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కేఈ కుట్ర పన్ని నారాయణ రెడ్డిని చంపించారని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కేఈ.. హత్యా రాజకీయాలతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.. అంత అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయడమే తమకు తెలుసని.. కుట్రలు, కుతంత్రాలు అలవాటు లేదన్నారు. నారాయణరెడ్డి హత్య దురదృష్టకరమని... దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ హత్య కేసు విచారణలో తామెలాంటి జోక్యం చేసుకోమన్నారు.