మధుకర్‌రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం.. మేము చేసుకుంటాం..

 

ఎన్‌ఆర్‌ఐ మధుకర్‌రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్‌ఆర్‌ఐ మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు భార్య స్వాతి కారణమని ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త ఆత్మహత్యకు తాను కారణం కాదని.. ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఇదిలా ఉండగా... ఆయన అంత్యక్రియలకు వెళ్లిన స్వాతిపై మధుకర్ రెడ్డి బంధువులు దాడి కూడా చేశారు. దీంతో మనస్థాపం చెందిన స్వాతి.. ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని కొత్తపేట సౌభాగ్యపురంలోని తన నివాసంలో హార్పిక్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్వాతి పెద్ద మొత్తంలో హార్పిక్ తాగిందని.. ఆమె అన్నవాహిక బాగా దెబ్బతిందని  వైద్యులు తెలిపారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆమెను కాపాడడం కష్టమని వారు అభిప్రాయపడ్డారు. ఇక స్వాతి తండ్రి దీనిపై స్పందిస్తూ.. వెంటనే పోలీసులు స్పందించకపోతే తాము కూడా ఆత్మహత్యకు పాల్పడతామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu