మోడీకి రాహుల్ గాంధీ సవాల్..
posted on Nov 20, 2015 10:48AM

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. తన పౌరసత్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్ష నేతలు నాపై కావాలనే బురద చల్లుతున్నారని.. నా పౌరసత్వంపై వెంటనే దర్యాప్తు చేయండి.. ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే ఏ చర్యలకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. నేను మోడీని చూసి భయపడటం లేదు.. దమ్ముంటే తానే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయాలి.. అనుచరులతో ఇలా మాట్లాడించడం సరికాదు అని అన్నారు. కాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని..అతనికి లండన్ పౌరసత్వం ఉందని..దీని గురించి నేను ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ కు కూడా లేఖ రాశాను.. భారత్ ద్వంద్వ పౌరసత్వం ఒప్పుకోదు కాబట్టి రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.