లాలు చిన్న కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి?
posted on Nov 20, 2015 11:11AM

బీహార్ ఎన్నికల్లో బీజేపీ పై మహా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు బీహార్ ఎన్నికల్లో అర్జేడీకి ఎక్కువ ఓట్లు రావు అని భావించినా కానీ జేడీయూ కంటే అర్జేడీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాగూ మొదటి నుండి నితీశ్ నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కాబట్టి ఆయనే బీహర్ ముఖ్యమంత్రిగా ఉంటారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. మరి లాలు పరిస్థితి ఎంటి అన్నది ప్రశ్న.. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఆయన కొడుకులకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి ఆయన నితీశ్ కుమార్ తో మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీంతో లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.