పవన్ 'గబ్బర్ సింగ్ 2' సీక్వెల్ స్టోరీ కాదు!
posted on Jun 19, 2013 2:09PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' సినిమా 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ కాదని వార్తలు వస్తున్నాయి. గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ పాత్ర శైలిని మాత్రమే తీసుకొని, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీయబోతున్నారని సమాచారం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సంపత్ నంది 'గబ్బర్ సింగ్ 2' కోసం కొత్త కాన్సెప్ట్ తో స్టోరీ రెడీ చేశారు. ఒక్క పవన్ పాత్ర మినహా ‘గబ్బర్‌సింగ్'కు ఈ సినిమాకూ ఎక్కడా పోలిక ఉండదని అంటున్నారు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.‘గబ్బర్‌సింగ్'కి పనిచేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడు జయనన్ విన్సెంట్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. హీరోయిన్ అండ్ మిగతా నటీ నటులు ఎంపిక చేయవలిసి ఉంది.