'కిస్' లో పవన్ కళ్యాణ్, మహేష్

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు! అదేంటీ వీరిద్దరూ ఒకే సినిమాలో ఎప్పుడు నటించారు అని ఆశ్చర్యపోతున్నారా! అసలు సంగతీ ఏమిటంటే...అడివి శేష్ హీరోగా చేస్తున్న 'కిస్' మూవీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కనిపించబోతున్నారు, అదీ ఎలాగంటే...అడివి శేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన పంజా సినిమాలోని, మహేష్ బాబు దూకుడు సినిమాలోని సీన్లను ఈ చిత్రంలో పెట్టారట. అది మ్యాటర్..ఆ విధంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

 

కిస్ ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియో‌లో పెట్టాలని అనుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మిస్‌ కెనడా ఫొటోజెనిక్‌ ప్రియా బెనర్జీ హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్‌ పాకాల, పీట్‌ వండర్‌ సంగీతం సమకూర్చారు. అడివి సాయికిరణ్‌ ఈ సినిమాకు నిర్మాత.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu