టచ్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్

 

పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు జనాల్లోకి మెరిసి మళ్ళీ మాయమైపోతూ వుంటారు. అది ఆయన స్టైల్. మొన్నామధ్య ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించి హడావిడి చేసిన ఆయన మళ్ళీ తనదైన శైలిలో మాయమైపోయారు. పవన్ కళ్యాణ్‌ ఎక్కడున్నారా అని సినీ, రాజకీయ వర్గాలు వెతుక్కుంటున్న సమయంలో ఆయన శనివారం ఉదయం ట్విట్టర్లో ప్రజల టచ్‌లోకి వచ్చారు. ‘‘‘జనసేన’ పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకి, అభిమానులకి, అక్కాచెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరుపేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..’’ అని అచ్చ తెలుగులో ట్విట్ చేశారాయన. ఆ తెలుగు ట్విట్‌లో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ, క్షమించేయొచ్చులెండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu