పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర ఎప్పటినుంచంటే..?
posted on Feb 10, 2025 3:47PM

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక ముందగా తాను నిర్ణయించుకున్నట్లు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరడానికి రెడీ అయిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 12న తమిళనాడు, కేరళ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు. ఆయన దర్శించుకునే ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి, శ్రీ పరసురామస్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే అగస్త్య పజీవ సమాధి, కుంభఏశ్వర ఆలయం, స్వామి మలయి, తిరుత్తాయ్ సుబ్రహ్మణ్వేస్వరస్వామి ఆలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణే తన అభిమతంగా చెప్పుకునే పవన్ కల్యాణ్ అందుకే ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరారు. తాను సనాతన ధర్మాన్ని మనసావాచాకర్మణా నమ్ముతానని పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే. సనాతన వ్యతిరేక మేధావుల మాటలు తనను ప్రభావితం చేయలేవని ఆయన అన్నారు.