రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. పవన్ కళ్యాణ్
posted on Jul 14, 2015 5:16PM

గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తొక్కిసలాటలో సుమారు 30 మంది వరకూ మృతి చెందారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని ఉన్నా.. తాను అక్కడకు వస్తే మళ్లీ తోపులాట జరిగే ప్రమాదం ఉంటుందని.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అందుకే అక్కడకు రాలేకపోతున్నాని ట్విట్టర్ తెలిపారు. నేను రాలేకపోయనా నా అభిమానులు మాత్రం సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు.