పవన్ కళ్యాణ్ లండన్ టూర్ వెనుక సీక్రెట్ అదే..
posted on Nov 5, 2017 1:16PM

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుండే అందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఇంకా స్పీడ్ పెంచాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధికారంలో దూసుకుపోతుంది. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ప్రస్తుతం పరిస్థితి అంత బాలేకపోయినా... పాదయాత్ర పేరుతో జనంలోకి వెళుతుంది. అందుకే తాము కూడా సమయం వృధా చేస్తూ కాలక్షేపం చేస్తే లాభం లేదని.. దూకుడు పెంచకపోతే రాజకీయంగా వెనుకబడిపోతాం అనే అభిప్రాయానికి వచ్చాడట. దీనిలో భాగంగానే ఓ వార్త బయటకి వచ్చింది. అది పవన్ త్వరలో లండన్ లో పర్యటించనున్నారట. ఈ నెల 18 న పవన్ కళ్యాణ్ లండన్ వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 18 న పవన్ కళ్యాణ్ లండన్ లో జరిగే తెలుగు యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ సిద్ధాంతాల్ని అక్కడి యువతకు వివరించనున్న పవన్ జనసేన పార్టీకి సహాయ సహకారాలు అందించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యక్రమాలను ఆయన విస్తృతం చేయాలని భావిస్తున్నారు.