చిరంజీవి, పవన్ కళ్యాణ్ భేటీ.. అన్నయ్యతో రాజకీయ విధానాలు వేరు
posted on Oct 19, 2015 11:13AM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం తన అన్న చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను ఇంటికి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్రూస్లీ సినిమాలో నటించినందుకు గాను చిరంజీవికి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అన్నయ్య చిరంజీవి, తన విధానాలు వేరైనప్పటికీ సినిమాల పరంగా తనకు అన్నయ్య అంటే తనకు గౌరవం అని.. తాను సినిమాల్లోకి రావడానికి, తనకు జీవితం కారణం చిరంజీవేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్యను చాలాసార్లు కలిశానని, ప్రత్యేకంగా కలవలేదని చెప్పారు.
కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనకు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని ఉందని.. కానీ షూటింగ్ ఉండటం వల్ల చెప్పలేకపోతున్నానని.. శంకుస్థాపనకు వెళ్లేది.. వెళ్లనిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.