పవన్ తో సినిమా తీస్తానంటున్న యంగ్ హీరో
posted on Sep 16, 2015 1:01PM
.jpg)
యువ హీరో నితిన్...పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని, పిచ్చిని గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చాటుకున్న నితిన్...ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ అవకాశమిస్తే, ఆయనతో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. పవన్ తో సినిమా నిర్మించే అవకాశం వస్తే, అది తన కెరీర్ లోనే చాలా స్పెషల్ అవుతుందంటున్న నితిన్...ఇతర పనులేమీ పెట్టుకోకుండా దానిపైనే ఫోకస్ పెడతానంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్ హీరోగా లాంఛింగ్ ఫిల్మ్ ను నిర్మిస్తున్న నితిన్... ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. అంతేకాదు అఖిల్ ఆడియో ఫంక్షన్ కి తన అభిమాన హీరో పవన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. అయితే పవన్ కు నితిన్ వీరాభిమని అన్న మాట నిజమే అయినా, అఖిల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పవర్ స్టార్ కు సోపేస్తున్నాడని అంటున్నారు. తన సినిమాల రిలీజ్ టైమ్ లోనూ ఏదోరకంగా పవన్ ను పొగుడుతూ, మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడని, ఇది కూడా అలాంటిదేనని గిట్టనివాళ్లుంటున్నారు.