పవన్ సాహసం.. తమిళనాడులో దీక్ష?
posted on Sep 16, 2015 12:57PM

కారణమేదైనా కావచ్చు ప్రతిపక్షనేతలకు వ్యతిరేకంగానే.. తమ డిమాండ్లు తీర్చాలనో ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు.. ఎన్నో రకాల దీక్షలు చేసుంటారు. అయితే అవి మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య చేసుంటారేమో కాని పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మన ప్రజల కోసం చేసి ఉండరు. ఇప్పుడు ఎవరు పక్క రాష్ట్రంలో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారా. సినీ రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. పదవి కోసం నేతలను ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే తాను ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు నేతలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపైనా.. భూసేకరణ విషయంలో ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద కాస్తంత నమ్మకం కలిగిందనే చెప్పాలి. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ కి చేసే సన్నాహంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మూహూర్తం కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకేసి తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో అడుగు వేయనున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా నటుడు చేయని సాహసం చేయనున్నారు. తెలుగు కోసం.. తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్భంధ తమిళం చట్టం కారణంగా తమ మాతృభాషను చదువుకునే అవకాశం కోల్పోతున్నామని అక్కడి తెలుగు సంఘాలు వాపోతున్న కారణంగా దీనిపై నిరసన చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తమిళనాడులోని హోసూరులో దీక్ష చేయాలని పూనుకున్నారట. అయితే ఈ దీక్ష తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. కేవలం తెలుగు ప్రజలకు సంఘీభావం తెలిపే విధంగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. మొత్తానికి ఏ నాయకుడు చేయని.. ఏ హీరో చేయని పెద్ద సాహసాన్నే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అర్దమవుతోంది. మరి ఈ దీక్ష సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.