పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక
posted on Aug 22, 2025 3:00PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలోవరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తొలి పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వ్రతమాచరించారు.
ఈ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంపించిన చీరలు, పసుపు, కుంకుమ కిట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ , పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మరెడ్డి శ్రీనివాస్ , జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.