బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్
posted on Aug 22, 2025 2:41PM
.webp)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో బీజేపీ నాయకులను కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.దీంతో నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తుర్కయాంజల్‌లోనూ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్‌కు తరలించారు. మరోవైపు సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆమెతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా బీజేపీ నేతలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్న మునిసిపల్ శాఖ నగర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం చెందుతుందని అన్నారు.
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా హై టెన్షన్ వైర్లు జనవాసాల మీద ఉండడం మూలంగా ఇటీవల రామంతపూర్ లాంటి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా చెప్పుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా, ఆయా విభాగాల మధ్య సమన్వయం లేదని దీంతో హైదరాబాదులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వెంటనే దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.