పార్లమెంటు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం

 

పార్లమెంటు ఆవరణలో ఆదివారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సందర్శకుల ప్రవేశ ద్వారం వద్ద విద్యుదాఘాతంతో ఏసీ ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగ దట్టంగా కమ్ముకుంది. ఈ మంటలను అదుపు చేయడానికి ఏడు ఫైరింజన్లు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా పార్లమెంట్‌కు వచ్చే పలు దారులను భద్రతా దళాలు మూసేశాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణను చేపట్టామని ఢిల్లీ సంయుక్త కమిషనర్ తెలిపారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలూ వెల్లడిస్తామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu