వెనక్కి తగ్గిన శరద్ యాదవ్
posted on Mar 18, 2015 2:41PM

దక్షిణ భారత మహిళల చర్మం రంగు, అందంపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అమ్మాయిల రంగు, అందంపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అలాగే, కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతీ ఇరానీని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై కూడా చింతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... యాదవ్ వ్యాఖ్యలు మీడియాలో చాలా అనుచిత ముద్రను వేశాయని వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని చెప్పారు. ఇందుకు శరద్ యాదవ్ సమాధానమిస్తూ, "ఆ వివాదం పట్ల నేను చింతిస్తున్నా. అంతేగాక మంత్రి స్మృతి ఇరానీ పట్ల నాకు గౌరవం ఉంది" అని చెప్పుకొచ్చారు.