జగన్ 420... బొండా
posted on Mar 18, 2015 1:06PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మళ్లీ తిట్ల పురాణం మొదలయ్యింది. 344 వ నిబంధన కింద నదుల అనుసంధానంపై చర్చ సందర్భంగా తెదేపా, వైకాపా నాయకుల ఒకరినొకరి ధూషించుకొన్నారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, రోజాలను ఐరన్ లెగ్ లని, 420గా ఉన్న జగన్ తన 420లతో కలిసి సభను గందరగోళం చేస్తున్నారని తిట్టిపోశారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు ఒక్కసారిగా లేచి ఆందోళనకు దిగారు. దీంతో తెదేపా, వైకాపా సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యి అది కాస్తా, పరస్పరం వ్యక్తి దూషణలకు దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకొంది. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.