భారత గూఢచార సంస్థ రా కొత్త చీఫ్ గా పరాగ్ జైన్ నియామకం
posted on Jun 28, 2025 5:56PM

భారత గూఢచార సంస్థ రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.పరాగ్ జైన్.. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది.
పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.వీటితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం కూడా పరాగ్ జైన్‌ను ఈ పదవికి ఎంపిక చేయడంలో దోహదపడింది. గతంలో ఆయన కెనడా, శ్రీలంక వంటి దేశాల్లోనూ భారత ప్రతినిధిగా దౌత్యపరమైన సేవలు అందించారు