మహా న్యూస్‌పై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
posted on Jun 28, 2025 4:38PM

హైదరాబాద్‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని పిలుపునిచ్చారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాని చంద్రబాబు ట్వీట్టర్ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. మహాన్యూస్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం చేశారు. కార్యాలయం లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపైనా దాడికి దిగినట్లు తెలుస్తోంది.