పాక్ కాల్పులు...మమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేయండి..

 

సరిహద్దు ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడుతున్న సంగతి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పేలుస్తూ పలుమార్లు కాల్పులు జరుపుతోంది. దీంతో సరిహ్దద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. ఎప్పుడు ఎలా దాడి చేస్తారని భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున రాజౌరీ సెక్టార్‌లో ఎల్‌వోసీని ఆనుకొని చీటి బక్రి గ్రామంపైకి పాక్‌ ఆర్మీ మళ్లీ కాల్పులు జరిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సన్యం పాక్‌ రేంజర్లకు గట్టి సమాధానం ఇచ్చింది. అంతేకాదు..  నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలను ఆర్మీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకు చెందిన 1000 మందిని రాజౌరీలో ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు తరలించారు. ఈ సందర్భంగా తలదాచుకున్న గ్రామస్తులు ‘ఆ కాల్పుల వర్షాన్ని మేం తట్టుకోలేం. అలాగని సొంత ఊరిని వదిలేసిరాలేం. మాకు వేరే దారిలేదు. మమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేయండి..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu