ఉత్తరకొరియాది రెచ్చగొట్టే చర్య...

 

ఇప్పటికే క్షిపణులు ప్రయోగిస్తూ పలు దేశాలకు ఆగ్రహం తెప్పిస్తున్న ఉత్తరకొరియా ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి సిద్దపడింది. నేడు ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది.  కుసాంగ్‌ సమీపంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్‌ సముద్రజలాల్లో కూలిపోవటం గమనార్హం. గత నెలలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలం కావడంతో నేటి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై జపాన్‌ రక్షణ మంత్రి స్పందిస్తూ.. ఉత్తరకొరియా తూర్పుతీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని తెలిపారు.

 

దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడంతో...దక్షిణకొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన మూన్‌ కూడా నేటి పరీక్షను ఖండించారు. ఇదో రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu