గెలిచి ఓడిన పాక్....సెమీస్ ఆశలు గల్లంతు
posted on Jul 6, 2019 9:36AM

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన మజిలీని ముగించింది. సెమీస్‌కి చేరాలంటే బంగ్లాదేశ్‌పై 300పైచిలుకు పరుగుల తేడాతో శుక్రవారం గెలవాల్సిన మ్యాచ్‌లో అన్ని పరుగులు సాధించినా కేవలం 94 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ సెమీస్‌కి అర్హత సాధించి రెడీగా ఉండగా ఇప్పుడు సెమీస్ ఆఖరి బెర్తుని న్యూజిలాండ్ ఖాయం చేసుకుంది. ఇక నిన్నటి మ్యాచ్ లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (100: 100 బంతుల్లో) సెంచరీ బాదగా బాబర్ అజామ్ (96: 98 బంతుల్లో ) సెంచరీకి దగ్గరగా వెళ్ళాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ కంటే నెట్ రన్‌రేట్‌లో తక్కువగా ఉన్న పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలంటే 316 పరుగుల టార్గెట్ తో దిగిన బంగ్లాదేశ్‌ని 7 పరుగులకే ఆలౌట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ 26 పరుగుల వరకూ కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయింది పాక్, ఈ క్రమంలో ఆరంభంలోనే పాక్ సెమీస్ దారులు అధికారికంగా మూసుకుయాయి.