పగతో రగిలిపోతున్న లాడెన్ కొడుకు...
posted on May 13, 2017 1:11PM

అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే లాడెన్ హత్యపై అతడి కుమారుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడట. ఈవిషయాన్ని ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 9/11 దాడుల విచారణలో పాల్గొన్న అలీ సౌఫన్.. తండ్రి తర్వాత అల్ ఖైదాకు తాను నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని తాను ఎంచుకుంటానని అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తండ్రి బిన్ లాడెన్‌కు హంజా మాటిచ్చాడని చెప్పారు.
కాగా ఇంతకుముందు హంజా ఓ ఆడియో టేప్ ద్వారా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 'నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నాను. అమెరికన్లు జాగ్రత్త.. అల్ ఖైదా మీ పై ప్రతీకారం కోసం ఎప్పుడూ రగిలిపోతుంటుందని... మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుందని.. ఇరాక్.. అఘ్గనిస్తాన్‌లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోమని చెప్పారు.