విశాఖ జీవిఎంసి లో పడిపోయిన మరో వైసీపీ వికెట్

విశాఖ నగరపాలక సంస్థ లో మరో వైసీపీ వికెట్ పడిపోయింది. గతవారం జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోయిన వైఎస్ఆర్సిపి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

  దీంతో వైసీపీ డిప్యూటీ పదవిని కూడా కోల్పోయినట్లే. వచ్చే నెలలో మరొక డిప్యూటీ మేయర్ నాలుగేళ్ల పదవి కాలం ముగియడంతో అప్పుడు కూడా మరో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి సభ్యులు నిర్ణయించారు ఇదిలా ఉండగా కేవలం పదవి మాత్రమే కాక వైఎస్ఆర్సిపి పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు జియ్యాని శ్రీధర్ పాల్పడినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే దిశలో కూటమి కార్పొరేటర్లు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అతనితో వ్యాపార సంబంధాలు నెరపే కూటమి నాయకులపై చర్యలు తీసుకుంటామని మూడు పార్టీల అధిష్టానాలూ హెచ్చరికలు జారీ చేశాయి.