మేకతల..మనిషి రూపం..ఒడిశాలో ఏం జరుగుతోంది

 

తల వేరే ఆకారంలో..మిగతా శరీర భాగమంతా మానవ రూపంలో ఉన్న వింత ఆకారాల్ని మనం హాలీవుడ్ సినిమాల్లో చూసి ఉంటాం. అమ్మో ఇలాంటివి నిజ జీవితంలో ఉంటే మన పరిస్ధితి ఏంటోనని కాస్త భయపడతాం. ఇప్పుడు అచ్చం అలాంటి వింత జీవి ఒకటి గ్రామాలపై విరుచుకుపడుతోంది..దొరికిన జీవిని దొరికినట్లు చీల్చి చెండాడుతోంది. ఇది జరిగింది ఎక్కడో కాదు..మన భారతదేశంలోనే. కటక్ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు అక్కడి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం ఆ వింత జీవి మేక తలతో మానవ శరీరాకృతిని పోలినట్లుగా ఉంది. ఈ జీవి రాత్రి వేళల్లో పశుశాలలో కట్టి ఉంచిన గొర్రెలు అత్యంత భయానకంగా చంపేస్తోంది. ఈ వార్తలను చదువుకున్న వారు...ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నా..ఘటనలు జరిగిన పరిసర ప్రాంతాల్లో కొన్ని అంతుచిక్కని పాదముద్రలు మాత్రం ఆలోచింపచేస్తోంది. ఇప్పటి వరకు గుర్తు తెలియని జంతువు దాడిలో 150 గొర్రెల వరకు మృత్యువాతపడటంతో అది తమ మీద ఎక్కడ విరుచుకుపడుతుందోనని జనం బిక్కు బిక్కుమంటున్నారు. అయితే వింత జంతువు దాడులపై జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజా నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు గానూ దాడులు జరుగుతున్న చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu